గ్రాండ్ బుడాపెస్ట్ కాన్సర్ట్ లో సత్తా చాటనున్న ఇండో-యూరోపియన్ యూత్ ఆర్కెస్ట్రా
Drift into music hyderabad based ieyo showcase talent grand budapest concert. హైదరాబాద్ కు చెందిన ఇండో-యూరోపియన్ యూత్ ఆర్కెస్ట్రా (IEYO) హంగేరీలోని రాయల్ ప్యాలెస్ ఆఫ్ గొడోల్లో
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 July 2023 6:45 PM ISTహైదరాబాద్ కు చెందిన ఇండో-యూరోపియన్ యూత్ ఆర్కెస్ట్రా (IEYO) హంగేరీలోని రాయల్ ప్యాలెస్ ఆఫ్ గొడోల్లో జరిగే ప్రతిష్టాత్మక గ్రాండ్ బుడాపెస్ట్ కాన్సర్ట్‌లో తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంది. ఆగష్టు నెలలో వీళ్లు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. అక్కడ ప్రదర్శన ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 2019 సంవత్సరంలో, ఆ తర్వాత 2022లో.. ఇక ఈ ఏడాది వాళ్లు ప్రదర్శన చేయబోతున్నారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా హంగేరీలోని బుడాపెస్ట్‌లోని భారత రాయబార కార్యాలయం వీరిని ఆహ్వానించింది. అమృత షేర్-గిల్ కల్చరల్ సెంటర్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో IEYO ప్రదర్శన ఇచ్చింది.
ఇండో-యూరోపియన్ యూత్ ఆర్కెస్ట్రా (IEYO) ఇంటర్ కల్చరల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ లో మంచి పేరు సంపాదించుకుంది. ఈ బృందం పాశ్చాత్య సంగీతాన్ని మాత్రమే కాకుండా, శాస్త్రీయ సంగీతం, భారతీయ జానపదాలతో కూడా ఆకట్టుకుంటుంది. ఈ బృందం భారతదేశం, USA, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, UK, హంగేరీ లలో ప్రదర్శన ఇచ్చి ప్రశంసలను సొంతం చేసుకుంది.
ఈ బృందం మొజార్ట్, బాచ్, వివాల్డి, బ్రహ్మస్ లను ప్రదర్శించడమే కాకుండా.. పాశ్చాత్య శాస్త్రీయ నిర్మాణాత్మక ఆర్కెస్ట్రా కోసం రాగ-ఆధారిత సంగీతంతో ప్రత్యేకంగా కచేరీలను నిర్వహిస్తూ ఉంది. ఇండో-యూరోపియన్ ఆర్కెస్ట్రా బృందం ఫౌండర్ డైరెక్టర్ మైఖేల్ మఖల్ మాట్లాడుతూ.. "ఈ కచేరీలు ఈ బృందానికి కావాల్సిన జ్ఞానం, అనుభవం, ప్రేరణని అందిస్తాయి. సంగీతంలో మా బృందానికి తెలియని చాలా విషయాలను నేర్పించడానికి.. విభిన్న విషయాలను పరిచయం చేయడానికి మేము హంగేరియన్ సంగీతకారుల బృందాన్ని కూడా ఆహ్వానిస్తున్నాము. యువకులు, సీనియర్ నిపుణుల కలయికతో కూడిన ఆర్కెస్ట్రా ఎంతో గొప్ప సంగీతానికి కేంద్ర బిందువు అవుతుంది. సంగీతం ద్వారా స్నేహాన్ని పెంపొందించడం.. ఆనందాన్ని పంచడం జరుగుతుంది. ఇండో-యూరోపియన్ ఛాంబర్/యూత్ ఆర్కెస్ట్రా ప్రాథమిక లక్ష్యం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని ప్రతిభావంతులైన సంగీత విద్వాంసులను ఒక చోటుకు తీసుకుని తీసుకురావడం. భారతదేశం, యూరప్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మకమైన ఫెస్ట్‌లలోనూ, ప్రసిద్ధ వేదికలలో సంగీత కచేరీలను నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం." అని అన్నారు.
హంగేరీలో నిర్వహించే ప్రోగ్రామ్ కు సంతూర్ ప్లేయర్ దేబాన్షు సేన్, బెంగళూరుకు చెందిన ప్రతిభావంతులైన యువ సాక్సోఫోన్ ప్లేయర్ విహాన్ సింగ్లా, ఆర్కెస్ట్రాలో లీడ్ వయోలినిస్ట్ సృజన్ ముఖర్జీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, అమెరికాలు చెందిన వయోలిన్ స్టూడెంట్స్ ఉన్నారు. కోల్ కతాకు చెందిన అరేంజర్-కంపోజర్ అరూప్ పాల్ కూడా బృందంలో భాగమయ్యారు. బుడాపెస్ట్‌కు చెందిన ఆరుగురు సీనియర్, ప్రఖ్యాత సంగీతకారులతో పాటు హంగేరియన్ సెలిస్ట్ లిలి టోల్నై, వయోలిన్ వాద్యకారుడు ప్రమిత్ బిస్వాస్ కూడా బృందంలో ఉంటారు. భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆర్కెస్ట్రా ప్రదర్శనతో కచేరీ ప్రారంభమవుతుంది.
ఇండో-యూరోపియన్ యూత్ ఆర్కెస్ట్రా ఫౌండర్ మైఖేల్ మకల్ కూడా క్లాసికల్ వయొలినిస్ట్, కండక్టర్, మ్యూజిక్ కంపోజర్. లండన్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో అసోసియేట్- the University of West London in Music Literacy (మ్యూజిక్ కంపొజిషన్). ఆటం ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్ట్, హైదరాబాద్ వ్యవస్థాపకుడు-డైరెక్టర్.. ఇండియా-ఇటలీ మ్యూజిక్ కొలాబోరేషన్ ఫౌండర్ క్రియేటర్.