Hyderabad: ఖైదీ కడుపులో తొమ్మిది మేకులు.. వైద్యులు షాక్
ఓ రోగి తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్లు అతని కడుపును స్కాన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
By అంజి Published on 21 April 2024 3:36 AM GMTHyderabad: ఖైదీ కడుపులో తొమ్మిది మేకులు.. వైద్యులు షాక్
ఓ రోగి తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్లు అతని కడుపును స్కాన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చివరకు 45 నిమిషాల పాటు కష్టపడి ఆ రోగి ప్రాణాలు కాపాడారు. ఇంతకు ఆ రోగి కడుపును స్కాన్ చేసి చూసిన వైద్యులు ఎందుకు షాక్ అయ్యారు. అసలు కడుపులో ఏం చూసి ఆశ్చర్యపోయారు. ఇది తెలియాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే. చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మహమ్మద్ షేక్ గత కొద్దిరోజులు కడుపునొప్పితో బాధపడుతూ ఉండడంతో అది గమనించిన జైలు అధికారులు అతన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఖైదీల వార్డులో అతనికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అతని కడుపును స్కాన్ చేయగా అందులో కనబడిన దృశ్యాలను చూసి వైద్యులు కాస్త ఆశ్చర్యచకితులయ్యారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆ ఖైదీ కడుపులో 9 మొలలు వరుసగా ఉండడం చూసి.. వైద్యులు అసలు వాటిని ఎలా మింగావని ప్రశ్నించడంతో అతను తనకి ఏమీ తెలియదంటూ చెప్పడంతో వైద్యులు మరింత షాక్‌కు గురయ్యారు. అనంతరం వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు అతనికి శస్త్ర చికిత్స చేసి 9 మొలలతో పాటు ఇనుప వస్తువులను కూడా బయటకు తీశారు. వైద్యులు ఈ విషయాన్ని జైలు అధికారులకు తెలియజేశారు. అయితే సదరు ఖైదీ జైల్లో కావాలనే వాటిని మింగాడా? అయితే ఎందుకోసం మింగాడు? అనే విషయాలపై జైలు అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఖైదీ గాంధీ ఆస్పత్రిలో కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.