హైదరాబాద్‌లో విషాదం.. బంతి తీసేందుకు వెళ్లి..
హైదరాబాద్ సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది.
By అంజి
హైదరాబాద్‌లో విషాదం.. బంతి తీసేందుకు వెళ్లి..
హైదరాబాద్ సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకృష్ణనగర్‌లోని శ్రీసాయి మణికంఠ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ (38) అనే ఆర్‌ఎంపీ డాక్టర్ ప్రాణాలు విడిచాడు. లిఫ్ట్ గుంతలో పడిన బాల్‌ను తీసేందుకు గుంతలో తలపెట్టి చూశాడు. అదే సమయంలో లిఫ్ట్ ఆన్ కావడంతో పైనుంచి ఒక్కసారిగా అది అతని మీద పడింది. దీంతో అతడు తీవ్ర గాయాలై చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల అపార్ట్‌మెంట్లలో వరుస లిఫ్టు ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల లిఫ్టు ప్రమాదాల్లో పడి పలువురు మృతి చెందారు. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న లిఫ్ట్ యాక్ట్ - 2025 అమల్లోకి తీసుకొచ్చేందు సన్నాహాలు చేస్తోంది.