చేప ప్రసాదం పంపిణీ.. భారీగా తరలి వచ్చిన జనం
కోవిడ్ కారణంగా మూడేళ్ల విరామం తర్వాత.. తిరిగి ఇవాళ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఇవాళ
By అంజి Published on 9 Jun 2023 10:15 AM ISTచేప ప్రసాదం పంపిణీ.. భారీగా తరలి వచ్చిన జనం
కోవిడ్ కారణంగా మూడేళ్ల విరామం తర్వాత.. తిరిగి ఇవాళ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఇవాళ ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. చివరిసారిగా 2019ల్ ఈ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కోవిడ్ కారణంగా మూడు సంవత్సరాలు పంపిణీ నిలిచిపోయింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె ప్రారంభం రోజు ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారికి బత్తిని బ్రదర్స్ ఉచితంగా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. 32 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.
చేప ప్రసాదం కోసం తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వంటి అనేక ప్రాంతాల నుండి చాలా మంది వ్యాధిగ్రస్తులు నాంపల్లి గ్రౌండ్‌ఉక చేరుకున్నారు. ఈ ప్రసాదం తీసుకుంటే శ్వాసకోశ ఇబ్బందులు తగ్గిపోతాయని ప్రజలు నమ్ముతారు. చేప ప్రసాదం పంపిణీ కోసం తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.5 లక్షల కొర్రమిను చేపలను అందుబాటులో ఉంచారు. మరో 75 వేల చేప పిల్లలతో పాటు.. మరిన్ని చేప పిల్లలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ దృష్ట్యా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.