ఉప్పల్ స్టేడియంలో టాయ్‌లెట్లను వీడియో తీసి పోస్టు చేసిన ఇంగ్లండ్ ఫ్యాన్.. రియాక్ష‌న్ ఎలా ఉందంటే..?

భారత జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో మొదటి టెస్ట్‌ మ్యాచ్ లో ఇంగ్లండ్‌ జట్టు పోరాడుతూ ఉంది

By Medi Samrat  Published on  27 Jan 2024 6:00 PM IST
ఉప్పల్ స్టేడియంలో టాయ్‌లెట్లను వీడియో తీసి పోస్టు చేసిన ఇంగ్లండ్ ఫ్యాన్.. రియాక్ష‌న్ ఎలా ఉందంటే..?

భారత జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో మొదటి టెస్ట్‌ మ్యాచ్ లో ఇంగ్లండ్‌ జట్టు పోరాడుతూ ఉంది. ఈ సిరీస్ చూడడానికి ఇంగ్లండ్ నుండి వచ్చిన అభిమాని హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. మురికిగా ఉన్న టాయిలెట్ వీడియోను పోస్టు చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరువు తీశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టాయ్ లెట్ల పరిస్థితి ఇదంటూ విమర్శలు గుప్పించాడు.

స్టేడియంలోని టాయ్ లెట్ ఫ్లోర్ మీద మురికి నీరు నిలిచిపోయింది. హైదరాబాద్‌లోని ఇంగ్లండ్ అభిమానులు ఉప్పల్ స్టేడియంలో ఎదురైన అనుభవాలను పంచుకోవాలని UKకి చెందిన జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు ఆ అభిమాని. ఇంగ్లండ్ అభిమానులు సన్ స్క్రీన్, నీటిని తీసుకుని వెళ్లడానికి భద్రతా అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో యూకేకు చెందిన జర్నలిస్ట్ మీ అనుభవాలను పంచుకోవాలని కోరారు. గేట్ల దగ్గర సెక్యూరిటీ తీసుకున్న వస్తువుల గురించి పక్కన పెడితే టాయిలెట్లు చాలా మురికిగా ఉన్నాయని విమర్శించారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) తీసుకున్న చర్యలు.. బీసీసీఐ నిర్వహిస్తున్న అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం చేసిన ఏర్పాట్లపై ప్రశ్నలను లేవనెత్తింది. పలువురు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.



Next Story