Hyderabad: డీసీఏ దాడులు.. అధిక ధరలకు మందులు అమ్ముతున్న క్లినిక్ మూసివేత
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం వనస్థలిపురంలో డీసీఏ అధికారులు రూ.5.52 లక్షల విలువైన రెండు మందుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
By అంజి Published on 23 April 2024 6:45 PM ISTHyderabad: డీసీఏ దాడులు.. అధిక ధరలకు మందులు అమ్ముతున్న క్లినిక్ మూసివేత
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం వనస్థలిపురంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు రూ.5.52 లక్షల విలువైన రెండు మందుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం ఉత్పత్తికి నిర్ణయించిన సీలింగ్ ధరతో పోలిస్తే స్వాధీనం చేసుకున్న వస్తువుల ఎంఆర్‌పీ ఎక్కువగా ఉంది. డీసీఏ అధికారులు అర్హత లేని క్లినిక్‌పై దాడి చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, బౌరంపేట్ గ్రామంలో విక్రయించడానికి నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు.
అధిక ధర కలిగిన మందుల స్వాధీనం
డీసీఏ రెండు అధిక ధర కలిగిన మందులను స్వాధీనం చేసుకుంది: ఇట్రాకోనజోల్ క్యాప్సూల్స్ BP 100 mg, ఇట్రాకోనజోల్ క్యాప్సూల్స్ BP 200 mg. ఏప్రిల్ 22-23 తేదీల్లో వనస్థలిపురంలోని ఓ మెడికల్ షాపుపై దాడులు నిర్వహించారు.
ఇట్రారోల్ -100 బ్రాండ్ పేరుతో విక్రయించే ఇట్రాకోనజోల్ క్యాప్సూల్స్, ఇట్రారోల్ -200పేరుతో విక్రయించే ఇట్రాకోనజోల్ క్యాప్సూల్స్ ధరలు డ్రగ్స్ ఆర్డర్ 2013 ప్రకారం నియంత్రణలో ఉన్నాయి. ఈ టాబ్లెట్ల రేటు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA), భారత ప్రభుత్వం నిర్ణయించిన సీలింగ్ ధరకు అనుగుణంగా ఉంటుందని డీసీఏ చీఫ్ వీబీ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మందులను నిర్ణయించిన ధరలకంటే ఎక్కువకు అమ్ముతున్నందుకు వీటిని సీజ్ చేశామని తెలిపారు.
ధరలు ఎంత పెంచారు?
మెడికల్ షాపులో దొరికిన ఇట్రారోల్-100 స్టాక్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాకు చెందిన సన్‌ఫైన్ హెల్త్ కేర్ తయారు చేసినట్లు కనుగొనబడింది. ఇది హర్యానాలోని కర్నాల్‌లోని జెమెంటిస్ లైఫ్ సైన్సెస్ ద్వారా మార్కెట్ చేయబడుతోంది.