బాగా గుర్తుపెట్టుకో సిన్న‌ప్పా.. మాస్క్ పెట్టుకో.. క‌రోనా ఇంకా ముగిసిపోలేదు

Cyberabad traffic police using Narappa movie poster.ట్రాఫిక్స్ రూల్స్‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సైబరాబాద్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2021 8:01 AM GMT
బాగా గుర్తుపెట్టుకో సిన్న‌ప్పా.. మాస్క్ పెట్టుకో.. క‌రోనా ఇంకా ముగిసిపోలేదు

ట్రాఫిక్స్ రూల్స్‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సైబరాబాద్‌ పోలీసులు సోష‌ల్ మీడియాను ఓ రేంజ్‌లో ఉప‌యోగించుకుటార‌న్న సంగ‌తి తెలిసిందే. స్టార్‌ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్లు, ఫేమస్‌ డైలాగులను వాడేస్తారు. ట్రెండ్‌ని ఫాలో అవుతూ తమదైన శైలీలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కేవ‌లం ట్రాఫిక్ రూల్స్‌పైనే కాకుండా క‌రోనాపై అవ‌గాహ‌న కూడా క‌ల్పిస్తున్నారు. క‌రోనా ఇంకా తొల‌గిపోలేద‌ని.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని గుర్తు చేస్తున్నారు.

వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన చిత్రం 'నార‌ప్ప‌'. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుద‌లైంది. వెంక‌టేష్ న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లోని డైలాగ్ బాగా ఫేమ‌స్ అయ్యింది. క‌రోనా పై అవ‌గాహ‌న కోసం ట్రాపిక్ పోలీసులు ఈ డైలాగ్‌ని వాడేసుకున్నారు. పోస్టర్‌లోని వెంకటేష్ ముఖానికి మాస్క్ తగిలించి'ఒక్క విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో సిన్నప్ప.. మాస్క్‌ పెట్టుకో సిన్నప్పా, కరోనా ఇంకా ముగిసిపోలేదు'అంటూ మీమ్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story