హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లపై బెట్టింగ్ పాల్పడుతున్న 10 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్

By M.S.R  Published on  11 April 2023 9:00 PM IST
Cricket betting gang, Hyderabad, IPL 2023, Warangal

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు 

ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లపై బెట్టింగ్ పాల్పడుతున్న 10 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బెట్టింగ్ ముఠా గురించి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి బెట్టింగ్ కి పాల్పడుతున్నారని అన్నారు. ఈ కాల్ సెంటర్ ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని పోలీసులు చెప్పారు. ఐపీఎల్ తో పాటు, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లపై కూడా ఈ ముఠా బెట్టింగ్ కు పాల్పడుతోందని పోలీసులు చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వారిలో 10 మందిని అరెస్ట్ చేశారు.

వరంగల్ లో కూడా బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారంకు చెందిన ఆటో డ్రైవర్ రాజేందర్ ఇంటిపై దాడి చేసి క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని బయట పెట్టారు. 68 వేల నగదు, 3 మొబైల్ ఫోన్స్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. రాజేందర్, ప్రమోద్ (29), సయ్యద్ అంకుస్ (35) లను అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు.

Next Story