హైదరాబాద్: ఐ బొమ్మ రవి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. గురువారం న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. పోలీసుల తరఫున న్యాయవాది కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రవి నుంచి ఇంకా కీలక సమాచారం సేకరించాల్సి ఉందని, దర్యాప్తు పూర్తికాకపోయిందని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. కేసు విచారణ దశలోనే ఉండడంతో బెయిల్ మంజూరు చేయకూడదని పోలీసు వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఇంకా 4 వేర్వేరు కేసుల్లో ఐబొమ్మ రవిని పైరసీ విచారణ కొనసాగించాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఒకే రకమైన కేసులో మళ్లీ కస్టడీ కోరడం, బెయిల్ రాకుండా పోలీసులు ప్రయత్నిస్తున్నారని రవి తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో రిజర్వ్ కస్టడీ, బెయిల్ పిటిషన్‌లపై నాంపల్లి కోర్టు వాదనలు పూర్తిచేసి తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పును నేడు (శుక్రవారం) వెలువడనుంది.