Hyderabad: యువకుడిపై కానిస్టేబుల్ దాడి.. వీడియో

హైదరాబాద్: ఓ పోలీసు ఓ వ్యక్తిని లాఠీతో దారుణంగా కొట్టడంతో శనివారం అర్థరాత్రి చాదర్‌ఘాట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

By అంజి  Published on  22 Oct 2023 10:49 AM IST
Chaderghat, constable, Hyderabad

Hyderabad: యువకుడిపై కానిస్టేబుల్ దాడి.. వీడియో

హైదరాబాద్: ఓ పోలీసు ఓ వ్యక్తిని లాఠీతో దారుణంగా కొట్టడంతో శనివారం అర్థరాత్రి చాదర్‌ఘాట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కానిస్టేబుల్ యువకుడిని దారుణంగా కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. రసూల్‌పురా నివాసి సమీ ఖాన్ అనే వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి తన ఇంటి దగ్గర నిలబడి ఉండగా పోలీసు వ్యాన్ వారిని చూసి ఆగింది. చారి అనే పోలీసు, పోలీసు వ్యాన్ నుండి దిగి సమీ ఖాన్‌పై లాఠీ దెబ్బలు కురిపించాడు, ఆ వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాడు. అతనిని అనుసరించిన కానిస్టేబుల్.. దూరంగా వెళ్లి మరీ అతడిని కొట్టాడు. స్థానికులు, ఇతర పోలీసులు జోక్యం చేసుకుని కానిస్టేబుల్‌ను అడ్డుకున్నారు.

దాడి చేసిన సమయంలో కానిస్టేబుల్‌ మద్యం మత్తులో ఉన్నాడని సమాచారం. ఘటన జరిగిన కొద్దిసేపటికే చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద జనం గుమిగూడి పోలీసుల చర్యను నిరసించారు. ఆజంపురా కార్పొరేటర్ అబ్రార్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసుల చర్యను నిరసించారు. కానిస్టేబుల్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్‌ను ఉన్నతాధికారులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. కాగా మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల కూడా పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story