హైదరాబాద్‌లోని కాలేజీల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు
Colleges in Hyderabad asked to form anti-drug committees. డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా హైదరాబాద్‌లోని కళాశాలలు, ఇతర తత్సమాన విద్యాసంస్థలు తమ సంస్థల్లో
By అంజి Published on 1 Nov 2022 4:16 AM GMTడ్రగ్స్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా హైదరాబాద్‌లోని కళాశాలలు, ఇతర తత్సమాన విద్యాసంస్థలు తమ సంస్థల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు. అధ్యాపకులు, విద్యార్థుల నుండి కనీసం ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ అన్ని కళాశాలలు, ఇతర సమానమైన విద్యాసంస్థల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీ (ఏడీసీ)ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అందులో భాగంగానే కళాశాలలు, ఇతర సమానమైన విద్యాసంస్థల్లో యువకులకు అవగాహన కల్పించడానికి నగర పోలీసులు ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, తోటివారి ప్రభావం తరచుగా యువతను మత్తు పదార్ధాలకు బానిసలుగా మారుస్తోంది. ఒకసారి చిక్కుకుపోతే జీవితం చిన్నాభిన్నం అవుతుంది. వారి కుటుంబాలకు, పెద్దగా ప్రజలకు భరించలేని బాధను కలిగిస్తుంది. గత రెండేళ్లలో మహమ్మారి ప్రేరేపిత అంతరాయం తర్వాత కళాశాలలు సాధారణ స్థితికి వచ్చినందున, పోలీసులు ఇప్పుడు ద్వంద్వ వ్యూహాన్ని చేపట్టారని, ఇది యువకులను చైతన్యవంతం చేయడంతో పాటు చట్టపరమైన చర్యలను చేపట్టిందని సీవీ ఆనంద్ చెప్పారు.
హైదరాబాద్ సిటీ పోలీసులు రూపొందించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం పనిచేసే ఈ ఏడీసీలు తమ క్యాంపస్‌లు మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండేలా వివిధ డిజిటల్ ప్రచారాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌ల ద్వారా డ్రగ్స్ దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే, మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి,తల్లిదండ్రులు, సిబ్బంది, విద్యార్థులు, ఏజెన్సీలు,పోలీసుల మధ్య సహకార విధానాన్ని నిర్ధారించడానికి సంస్థ అధిపతి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.
ఈ కమిటీలు మాదకద్రవ్యాల వినియోగం లేదా స్వాధీనం లేదా అమ్మకం లేదా కొనుగోలుపై సమాచారం ఇవ్వడానికి స్థానిక పోలీసులతో కూడా సంప్రదింపులు జరుపుతాయి. పౌరులు హైదరాబాద్ పోలీస్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌కు 8712661601 లేదా 040-27852080కు తెలియజేయవచ్చు. సురక్షితమైన వాతావణంలో విద్యార్థులు తమ చదువు కొనసాగించాలని.. మరింత బాధ్యతాయుతమైన పౌరులుగా అభివృద్ధి చెందడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీవీ ఆంనద్ తెలిపారు.