సీఎం రేవంత్‌ కాన్వాయ్‌కి తృటిలో తప్పిన ప్రమాదం.. పేలిన కారు టైరు

హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌లోని జామర్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎగ్జిట్–17 వద్ద రింగ్‌ రోడ్‌పై వెళ్తున్న...

By -  అంజి
Published on : 9 Dec 2025 8:02 AM IST

CM Revanth convoy, narrowly misses accident, burst car tire, Hyderabad

సీఎం రేవంత్‌ కాన్వాయ్‌కి తృటిలో తప్పిన ప్రమాదం.. పేలిన కారు టైరు

హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌లోని జామర్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎగ్జిట్–17 వద్ద రింగ్‌ రోడ్‌పై వెళ్తున్న సమయంలో కాన్వాయ్‌లోని జామర్ కార్ కుడి వైపు వెనుక టైర్ అకస్మాత్తుగా పగిలిపోయింది. టైర్ బ్లాస్ట్ కావడంతో క్షణాల్లోనే పరిస్థితి క్లిష్టంగా మారింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించి పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు.

సమాచారం అందుకున్న ట్రాఫిక్ టీమ్ వెంటనే స్పందించి జామార్ వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడే స్టెప్నీ టైర్‌ను అమర్చి వాహనాన్ని మళ్లీ రోడ్డు మీదికి తీసుకొచ్చారు. అనంతరం జామర్ వాహనానికి అవసరమైన చెక్‌లు, చిన్నమొత్తం మరమ్మతులు పూర్తి చేసిన అధికారులు.. వాహనాన్ని తిరిగి సీఎం కాన్వాయ్‌లో చేర్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story