హైదరాబాద్‌ సిటీలో చెత్తకు నో ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త మాస్టర్ ప్లాన్!

హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

By -  అంజి
Published on : 8 March 2026 6:55 AM IST

CM Revanth Reddy, Clean Hyderabad, 99 Days Pragathi Pranalika, Door-to-door waste collection, Electric Vehicles for garbage, Core Urban Region Economy (CURE), Tri-Municipal Corporations, Construction & Demolition (C&D) Waste Management

హైదరాబాద్‌ సిటీలో చెత్తకు నో ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త మాస్టర్ ప్లాన్!

హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్స్‌కు సంబంధించిన ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. క్యూర్ పరిధిలో ప్రతీరోజు ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని సూచించారు. ఒక్కో వాహనానికి ఒక్కో ప్రాంతం చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంపింగ్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్పోరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా, అలాగే ప్రతినిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్మాణ రంగంలో వ్యర్థాలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పోరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అపరిశుభ్రత లేకుండా చూసుకోవడం, దోమల నివారణ, సీజనల్ వ్యాధుల విషయంలో నగర వాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీఎం మాజీ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్, సైబరాబాద్‌ కమిషననర్‌ శ్రీజన, మల్కాజ్‌గిరి కమిషనర్‌ వినయ్ కృష్ణారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story