'కోకాపేటలోని ఆ భూములు శారదా పీఠానికే'.. సీఎం రేవంత్‌ ప్రకటన

కోకాపేటలోని శారదా పీఠానికి మొదట కేటాయించిన భూమి పీఠం వద్దనే కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.

By -  అంజి
Published on : 1 March 2026 7:53 AM IST

CM Revanth, Sharada Peetam, Kokapet, Hyderabad, HMWSSB

'కోకాపేటలోని ఆ భూములు శారదా పీఠానికే'.. సీఎం రేవంత్‌ ప్రకటన

హైదరాబాద్: కోకాపేటలోని శారదా పీఠానికి మొదట కేటాయించిన భూమి పీఠం వద్దనే కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు, ఇటీవల హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డు (HMWSSB)కి కేటాయించిన స్థలాన్ని రద్దు చేశారు.

కోకాపేట‌లో శార‌దా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఠం భూములు జ‌ల మండ‌లికి కేటాయించిన నేప‌థ్యంలో అక్క‌డ సాగుతున్న నిర్మాణ ప‌నుల విష‌యాల‌ను పీఠం ప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి.. ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వ‌ర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని తెలుసుకున్నారు. పీఠం భూముల‌ను జ‌ల‌మండ‌లికి కేటాయించే స‌మ‌యంలో నిర్మాణాల స్థితిని తెలియ‌జేయ‌క‌పోవ‌డంపై ముఖ్య‌మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జ‌ల మండ‌లికి కేటాయింపులు ర‌ద్దు చేసి శారదా పీఠానికే ఆ భూములు కొన‌సాగించాల‌ని ఆదేశించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌ బాబుని క‌లిసి నిర్మాణాలు, ఇత‌ర ప‌రిస్థితుల‌ను వివ‌రించాల‌ని ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి, పీఠం ప్ర‌తినిధుల‌కు సూచించారు.

Next Story