శంషాబాద్ వరకూ మెట్రో.. డిసెంబర్ 9న శంకుస్థాపన

CM KCR to lay foundation for Airport Express Metro Corridor on Dec 9. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరించనున్నారు.

By M.S.R  Published on  27 Nov 2022 10:20 AM GMT
శంషాబాద్ వరకూ మెట్రో.. డిసెంబర్ 9న శంకుస్థాపన

శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరించనున్నారు. మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రోను పొడిగించనున్నారు. ఈ మార్గంలో నిర్మాణ పనులకు డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ 31 కి.మీల మార్గానికి రూ.6,250 కోట్లు ఖర్చు అవుతుందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరికి కేటీఆర్ నవంబర్ 14న లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ కింద నిర్మించ తలపెట్టిన బీహెచ్ఈఎల్- లక్డీకపూల్, నాగోల్- ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు అందించాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం రూ.8,453 కోట్లు ఖర్చవుతుందని.. దీని నిమిత్తం 2023- 24 కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు. సెకండ్ ఫేజ్‌లో 31 కి.మీల మేర మెట్రోను నిర్మించనున్నారు. ఇందులో బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కి.మీ మేర మార్గం వుంటుందని.. ఇందులో 23 స్టేషన్లు వుంటాయన్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు నిర్మించే మార్గంలో 4 మెట్రో స్టేషన్లు వుంటాయని కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. శంషాబాద్ వరకూ మెట్రో వస్తే ఎయిర్ పోర్టుకు వెళ్లివచ్చే వారికి ఎంతో సహాయంగా మారుతుంది.



Next Story