రేపు కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం..వీటిపైనే చర్చ

CM KCR Meetiong on Tomorrow.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

By సుభాష్  Published on  6 Dec 2020 3:38 AM GMT
రేపు కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం..వీటిపైనే చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రైతుబంధు నిధుల విడుదలపై ఈ సమీక్ష నిర్వహిచంనున్నారు. ప్రగతిభవన్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు. ఈ ఏడాది రెండో విడత రైతు బంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీ అంశాలపై కేసీఆర్‌ చర్చించనున్నారు.

కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. గ్రేటర్‌ ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటలేకపోయింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ టీఆర్‌ఎస్‌కు నిద్రలేకుండా చేసింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు చర్చకు వస్తాయని తెలుస్తోంది. భవిష్యత్తులో బీజేపీని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై కూడా చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం.

Next Story
Share it