సీఎం కేసీఆర్‌కు వైద్యపరీక్షలు పూర్తి

CM KCR Health Tests Completed. సీఎం కేసీఆర్‌కు వైద్యపరీక్షలు పూర్తయ్యాయి. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో

By Medi Samrat  Published on  7 Jan 2021 1:10 PM GMT
CM KCR health checkup

సీఎం కేసీఆర్‌కు వైద్యపరీక్షలు పూర్తయ్యాయి. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు సీఎం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. అన్నీ రకాల పరీక్షలు చేశాం. అంతా బాగానే ఉందన్నారు డాక్టర్లు. పరీక్షలకు సంబంధించిన ఫలితాలను రేపు వెల్లడించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్‌ తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.

ఇదిలావుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మద్యాహ్నం సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకొనేందుకు వెళ్లారు. సిఎం కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంట (lungs burning)గా ఉండడంతో బుధవారం ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఎం.ఆర్.ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరం కావడంతో, వాటిని గురువారం మద్యాహ్నం ఆసుపత్రిలో నిర్వహించారు. దీంతో కేసీఆర్ వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రికి వెళ్లారు.


Next Story