ఎదురుపడ్డ సీఎం జగన్, నందమూరి బాలకృష్ణ

CM Jagan and Nandamuri Balakrishna faced each othe. సూపర్ స్టార్ కృష్ణకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కృష్ణకు నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్‌కు

By M.S.R  Published on  16 Nov 2022 11:39 AM GMT
ఎదురుపడ్డ సీఎం జగన్, నందమూరి బాలకృష్ణ

సూపర్ స్టార్ కృష్ణకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కృష్ణకు నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పలికరించి, మహేశ్ బాబును ఆలింగనం చేసుకున్నారు. గల్లా జయదేవ్‌తోనూ మాట్లాడారు. ఆ సందర్భంలో అక్కడే ఉన్నారు నందమూరి బాలకృష్ణ. ఆ సమయంలో వారిద్దరూ ఒకరిని మరొకరు పలుకరించుకుని నమస్కారం చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

నంద‌మూరి బాల‌కృష్ణ కృష్ణ పార్థివ దేహాన్ని ద‌ర్శించి నివాళులు అర్పించారు. బాలకృష్ణ సూపర్ స్టార్ కృష్ణను కొనియాడారు. కృష్ణ సినిమా కెరీర్ ప‌రిశీలిస్తే ఎన్నో సాహసాల‌కు, ప్ర‌యోగాల‌కు మారు పేరని.. చ‌ల‌న చిత్ర రంగానికి ఎన‌లేని సేవ‌లు చేశారని కొనియాడారు. మొద‌టి కౌబాయ్ సినిమా, మొద‌టి సినిమా స్కోప్ సినిమా, మొద‌టి 70 ఎం.ఎం సినిమా, మొద‌టి డి.టి.ఎస్ సౌండ్ సిస్ట‌మ్ మూవీ ఇలా చాలా టెక్నిక‌ల్ అంశాల‌ను తెలుగు సినిమాకు అందించారు. తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానం ద‌క్కించుకున్నారు కృష్ణ‌ అని.. నాన్న‌గారు, కృష్ణ‌గారే ఇండ‌స్ట్రీకి బంగారు గుడ్లు పెట్టే బాతులని చెప్పుకొచ్చారు. నిర్మాత‌ల‌కు అండ‌గా నిలిచారు. నేను కృష్ణ‌గారితో క‌లిసి సుల్తాన్ సినిమాకు ప‌ని చేశాను. ఆ స‌మ‌యంలో ఎప్పుడూ ఆయ‌న నాన్న‌గారి గురించే చెబుతుండేవారు. నాన్న‌గారిని స్ఫూర్తిగా తీసుకున్నాన‌ని ఆయ‌న చెప్పారు. భావి నిర్మాత‌ల‌కు నాన్న‌గారైతేనేమి, కృష్ణ‌గారైతేనేమి స్ఫూర్తిగా నిలిచారని నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు.


Next Story