రూ. 50 కోట్లు దండుకున్న చైనా గ్యాంగ్ అరెస్ట్
China Gang Arrest. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయకులకు వల వేసి భారీ మోసాలకు చైనా ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు.
By Medi Samrat Published on
8 Feb 2021 4:19 AM GMT

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయకులకు వల వేసి భారీ మోసాలకు చైనా ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. ఈ ముఠా దేశవ్యాప్తంగా 20 వేల మందికి టోకరా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి రూ. 50 కోట్ల మేర స్వాహా వసూలు చేసినట్టు సమాచారం.
ముఠాలోని ముగ్గురు సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాగ, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలెట్టారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఈరోజు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
Next Story