త్వరలో చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు
By అంజి Published on 29 Nov 2024 11:02 AM ISTత్వరలో చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
హైదరాబాద్: చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.428 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్‌లో ఆధునిక సౌకర్యాలు, అన్ని ప్లాట్ ఫారమ్‌లను కలుపుతూ ఐదు లిఫ్ట్‌లు, ఐదు ఎస్కలేటర్లు ఉంటాయన్నారు. పార్శిల్ బుకింగ్ సౌకర్యాలు ఉండనున్నాయి. మొత్తం 19 లైన్లలో 25 రైళ్ల జతలు రాకపోకలు కొనసాగించనున్నాయి. దీని వల్ల కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
పెరిగిన ఫుట్‌ఫాల్‌కు అనుగుణంగా రూపొందించబడిన ఈ అధునాతన రైల్వే స్టేషన్ అనేక సౌకర్యాలను కలిగి ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీ నగర్, ఉప్పల్, మల్కాజ్‌గిరితో కూడిన నగరంలోని తూర్పు ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండడంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ స్టేషన్, ఒకసారి ప్రారంభించబడితే ఈ ప్రాంతాలలోని ప్రజలకు రాకపోకలు సాగించడానికి వీలు కల్పిస్తుందని వారు భావిస్తున్నారు. నగరంలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్ల తర్వాత ఐదో టెర్మినల్‌గా చెర్లపల్లి రానుంది.