హైదరాబాద్: ఐడీపీఎల్ భూముల స్కామ్‌పై బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రూ.400 కోట్లకు పైగా విలువైన భూముల అక్రమ ఆక్రమణపై TGIIC ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ పరిధిలో IDPLకు చెందిన విలువైన భూములను A TO A హోం ల్యాండ్‌తో పాటు మరికొందరు ఆక్రమించారు.
ఈ వ్యవహారంలో A TO A హోం ల్యాండ్ పాటు IDPL, NIPER, రెవెన్యూ, ఎస్టేట్ శాఖల అధికారుల కుమ్మక్కు ఉన్నట్లు (TG IIC) తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది. 2020 నుంచి 2024 మధ్య జరిగిన సర్వేల్లో పంచనామాలు, రెవెన్యూ రికార్డులు మార్చి 2023లో అక్రమంగా పాస్‌బుక్స్ జారీ చేసినట్లు తెలిసింది. ఈ కేసులో విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేపట్టగా పోలీసులు సమాంతర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.