Hyderabad: దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు
దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమిచారన్న ఫిర్యాదుపై కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు
By - Knakam Karthik |
Hyderabad: దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు
హైదరాబాద్ నగరంలోని కీలక జలాశయాలలో ఒకటైన దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమిచారన్న ఫిర్యాదుపై కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దుర్గం చెరువు పరిధిలోని సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించడమే కాకుండా దాన్ని వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. హైడ్రా సూపర్‌వైజర్ క్రాంతి ఆనంద్ ఈ విషయాన్ని గుర్తించి వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి లపై ఫిర్యాదు చేశాడు. ఈ ఇద్దరు దుర్గం చెరువు పరిధి లోని చెరువు భూమిని మట్టి, రాళ్లతో కప్పి సహజ నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిం చేలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతే కాకుండా ఈ ఇద్దరు నిందితులు ప్రభుత్వం భూమిని ఆక్రమించి..నిర్మాణాలు చేపట్టి ఎస్ టి ఎస్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీకి సంబంధించిన పార్కింగ్ స్థలంగా ఉపయోగిస్తూ అక్రమంగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారని ఫిర్యాదులో స్పష్టం గా పేర్కొన్నారు. అయితే హైడ్రా సూపర్‌వైజర్ క్రాంతి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్లు 329 (3), 3(5) తో పాటు పిడిపిపి యాక్ట్ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.
పోలీసులు దర్యాప్తులో దుర్గం చెరువుకు సంబంధించి 2014 సంవత్స రంలో కూడా హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఫుల్ ట్యాంక్స్ లెవెల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఈ ఇద్దరు నిందితులు ఆ నోటిఫికేషన్‌ను లెక్కచేయకుండా దుర్గం చెరువు పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా నిర్మాణాలు కూడా చేపట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ అక్రమ ఆక్రమణ వల్ల చెరువు విస్తరణ తగ్గిపోవ డమే కాకుండా పర్యావర ణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు ప్రస్తుతం సంఘటనా స్థలాన్ని పరిశీలిం చడమే కాకుండా సంబంధిత రెవెన్యూ , హెచ్ఎండిఏ, మున్సి పల్ శాఖల రికార్డు లను కూడా సేకరిస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమ ణకు సంబంధించిన ఆధారాలు, అక్రమంగా సంపాదించిన ఆదాయంపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు.