Hyderabad: బేకరీపై తప్పుడు పుకార్లు వ్యాప్తి.. ఇద్దరు యూట్యూబర్‌లపై కేసు నమోదు
హయత్‌నగర్‌లోని పెద్ద అంబర్‌పేటలో బేకరీపై వదంతులు ప్రచారం చేసిన ఇద్దరు యూట్యూబర్‌లపై బుధవారం కేసు నమోదైంది.
By అంజి Published on 18 Oct 2024 2:30 AM GMTHyderabad: బేకరీపై తప్పుడు పుకార్లు వ్యాప్తి.. ఇద్దరు యూట్యూబర్‌లపై కేసు నమోదు
హైదరాబాద్: హయత్‌నగర్‌లోని పెద్ద అంబర్‌పేటలో బేకరీపై వదంతులు ప్రచారం చేసిన ఇద్దరు యూట్యూబర్‌లపై బుధవారం కేసు నమోదైంది. సోషల్ మీడియాలో బేకరీ పరువు తీశారంటూ ఇద్దరు వ్యక్తులపై హయత్‌నగర్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. నిందితులు నరసింహ, వీరేష్‌లు బేకరీలో టీ, కేక్ ఆర్డర్ చేసినట్లు సమాచారం. "డబ్బులు చెల్లించమని అడిగినప్పుడు, ఇద్దరూ తాము జర్నలిస్టులమని, కేక్ ఖరీదు తగ్గించాలని డిమాండ్ చేసారు" అని హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ పి. నాగరాజు ఫిర్యాదు నుండి తెలిపారు.
అన్వర్ అనే కార్మికుడు అందుకు నిరాకరించడంతో, నిందితులు గొడవ వీడియోను రికార్డ్ చేసి, బేకరీ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం ప్రారంభించారు. వీరేష్, నరసింహ అనే నిందితులు బేకరీలో పనిచేస్తున్న అన్వర్‌ను లక్ష్యంగా చేసుకుని వీడియోలు పోస్ట్ చేశారు. అంతేకాకుండా, వారు తమ ఛానెల్‌లలో బేకరీ నిర్వహణకు వ్యతిరేకంగా అవమానకరమైన వీడియోలను పోస్ట్ చేశారని, వారి చర్యలు ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని, మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా హయత్‌నగర్ పోలీసులు రెండు మతాల మధ్య విబేధాలు సృష్టించారని, ఓ తినుబండారంపై తప్పుడు ప్రచారం చేశారని కేసు నమోదు చేశారు.
జర్నలిస్టులుగా చెప్పుకునే యూట్యూబర్‌లు కేక్‌లు, ఇతర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని బేకరీ సిబ్బందిని కోరినట్లు విచారణలో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. వారు నిరాకరించడంతో, నిందితులు బేకరీపై తప్పుడు వార్తలు పోస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్న దానికి భిన్నంగా నిందితుడి వీడియో ఉంది. వీడియోలో, ఇద్దరు నిందితులు అన్వర్ ఒక పాత్రతో కుక్క నోటి దగ్గరపెట్టి, ఆపై దానిని కడగకుండా, టీ సిద్ధం చేయడానికి ఉపయోగించాడని చెప్పారు.