చిన్నపిల్లల్లో గుండె జబ్బుల నివారణ పై కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వాకథాన్
Care Hospital organizes a walkathon to raise awareness about Heart disease in children.కొందరు చిన్నారులు పుట్టికతోనే గుండె జబ్బులతో
By తోట వంశీ కుమార్ Published on 14 Feb 2023 5:23 AM GMTఇటీవల కాలంలో కొందరు చిన్నారులు పుట్టికతోనే గుండె జబ్బులతో బాధపడుతున్నారు. దీనిపై అవగాహాన కల్పించి మరణాల సంఖ్యను తగ్గించే లక్ష్యంలో మంగళవారం కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో వాకథాన్ ను నిర్వహించారు. ఈ వాకథాన్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ డాక్టర్ రాధారాణి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ వాకథాన్‌లో 100 మందికి పైగా గుండె లోపాలతో బాధపడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులతో పాటు వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. డా.తపన్దాష్, డా.కవితచింతల్లా, డా.ప్రశాంత్పాటిల్ల పాటు జస్టిస్ డాక్టర్ రాధారాణి కూడా ఇందులో పాల్గొన్నారు.
పుట్టుకతో వచ్చే గుండెజబ్బు (CHD)
CHD అనేది పుట్టుకతో వచ్చే గుండె నిర్మాణంలో లోపంవల్ల కలుగుతుంది. 100 మంది పిల్లలలో ఒకరు గుండె లోపాలతో పుడుతున్నారు. పిల్లల మరణాలకు ఇది ప్రధాన కారణాలలో ఒకటి. పుట్టుకతో కొంత మంది పిల్లలకి గుండెలో రంద్రాలు ఉంటాయి. కొన్నిసార్లు వీరికి వెంటనే ఆపరేషన్ చేసి సమస్యని పరిష్కరిస్తే మరికొంత మందికి మాత్రం కొన్నిరోజుల తర్వాత అంటూ వాయిదా వేస్తారు. గుండె సమస్యలు ఉన్న పిల్లల్లో కొంత మంది బ్లూబేబీస్ కూడా ఉంటారు. శస్త్ర చికిత్సల రేటు దాదాపు 100% ఉంటుంది. సంక్లిష్ట గుండె లోపాల విషయంలో 90% కంటే ఎక్కువ మంది పిల్లలు ఇప్పటికీ నయమవుతున్నారని కాబట్టి గుండె జబ్బులతో పుట్టిన పిల్లల తల్లిదండ్రులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని బంజారాహిల్స్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ కేర్ ఆస్పత్రి డెరెక్టర్ మరియు హెచ్ఓడి డాక్టర్ తపన్దాష్ తెలిపారు.
సాధారణంగా శరీరంలో ముఖ్య అవయవం గుండె
గుండెని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏవయసు వారైనా ముందు నుంచి గుండె విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్త అవసరం. సాధారణంగా కొంత మంది పిల్లలు పుట్టుకతోనే గుండె సమస్యలతో పుడతారు. వీరి విషయంలో తల్లిదండ్రులకి పూర్తి అవగాహన ఉండాలి. ఎటువంటి ఆలస్యం లేకుండా సకాలంలో స్క్రీనింగ్, రోగనిర్ధారణ మరియు చికిత్స యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి అని డా.కవిత కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ తెలిపారు.
శ్రీ నీలేష్ గుప్తా హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ మాట్లాడుతూ.. ఈ రోగులలో అనారోగ్యం, మరణాలను తగ్గించడానికి పుట్టుకతో వచ్చే హార్ట్ డిసీజ్ ఉన్న పిల్లలకు ప్రపంచ స్థాయి గుండె సంరక్షణను తక్కువ ఖర్చుతో అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.