క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించడానికి కేర్ హాస్పిటల్ - సైక్లోథాన్
Care Hospital - Cyclothon to create awareness about cancer disease.క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కేర్ హాస్పిటల్స్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Feb 2023 1:12 PM ISTహైదరాబాద్ : క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో సైక్లోథాన్‌ను నిర్వహించారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్-మాదాపూర్ కె. శిల్పవల్లి, డాక్టర్ A.M.V.R.నరేంద్ర( HOD హెమటాలజీ) లు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సైక్లోథాన్ కేర్ ఆస్పత్రి హైటెక్ సిటీ నుంచి ప్రారంభమై సెంట్రల్ యూనివర్శిటీ మీదుగా తిరిగి కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వద్దకు చేరుకోవడంతో పూరైంది.సైక్లోథాన్ లో కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీకి చెందిన హెచ్‌సీఓఓ రాజీవ్ చౌరే, కేర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ హెచ్‌ఓడీ డాక్టర్ సుధా సిన్హా, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సతీష్ పవార్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ మాదాపూర్ కె.శిల్పవల్లి మాట్లాడుతూ.. భయంకరమైన క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు సైక్లోథాన్‌ను నిర్వహించడం అభినందనీయన్నారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రజలలో క్యాన్సర్ అక్షరాస్యత మరియు విద్యను పెంపొందించడానికి కృషి చేస్తుందన్నారు రాజీవ్ చౌరే. క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన ధూమపానం మరియు పొగాకు వాడకం వంటి హానికరమైన అలవాట్లను అరికట్టడానికి సైక్లింగ్ సహాయపడుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ సైకిల్ తొక్కాలని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా సైక్లింగ్ చేసేలా ప్రేరేపించాలని మరియు వారికి పుట్టినరోజు బహుమతిగా సైకిల్ ఇవ్వాలని సూచించారు. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.
డాక్టర్ సుధా సిన్హా మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వేలాదిగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. దురదృష్టవశాత్తు వీరిలో చాలా మంది మరణిస్తున్నారన్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రజల్లో క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడమేనని చెప్పారు. వ్యాధి ముదిరిన తరువాతనే గుర్తిస్తున్నారన్నారు. క్యాన్సర్‌ను తొలి నాళ్లలోనే గుర్తిస్తే నయం చేయవచ్చునని తెలిపారు. ముందుగా గుర్తించడమే చికిత్సలో కీలమన్నారు. ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన పెంచేలా మనమందరం కృషి చేయాలన్నారు.
CARE హాస్పిటల్స్ గ్రూప్
భారతదేశంలోని 6 రాష్ట్రాల్లోని 8 నగరాల్లో 16 హెల్త్‌కేర్ సదుపాయాలను నిర్వహిస్తున్న మల్టీ-స్పెషాలిటీ హెల్త్‌కేర్ ప్రొవైడర్. హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, రాయ్‌పూర్, నాగ్‌పూర్, పూణే, ఇండోర్ & ఔరంగాబాద్‌లలో ఆస్పత్రులు ఉన్నాయి. టాప్ 5 పాన్-ఇండియన్ హాస్పిటల్ చెయిన్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. CARE హాస్పిటల్స్ 2700 పడకలతో 30కి పైగా క్లినికల్ స్పెషాలిటీలలో సమగ్ర సంరక్షణను అందిస్తోంది. CARE హాస్పిటల్స్ దక్షిణాసియా మరియు ఆఫ్రికా అంతటా తన సేవలను విస్తరించే ప్రభావంతో నడిచే హెల్త్‌కేర్ నెట్‌వర్క్ అయిన ఎవర్‌కేర్ గ్రూప్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.