పాతబస్తీలో దారుణం.. కారు తీయమన్నందుకు డాక్టర్‌ ఎలా కొట్టారో చూడండి.. వీడియో

Car parking dispute in Hyderabad.. Neighbors brutally beat the doctor. పక్కింటి వారు ఆస్పత్రి స్థలంలో కారును పార్క్‌ చేశారు. అయితే ఆ కారు వచ్చి పోయే రోగులకు ఇబ్బంది కలిగిస్తోందని

By అంజి  Published on  14 Oct 2022 5:31 AM GMT
పాతబస్తీలో దారుణం.. కారు తీయమన్నందుకు డాక్టర్‌ ఎలా కొట్టారో చూడండి.. వీడియో

పక్కింటి వారు ఆస్పత్రి స్థలంలో కారును పార్క్‌ చేశారు. అయితే ఆ కారు వచ్చి పోయే రోగులకు ఇబ్బంది కలిగిస్తోందని ఆస్పత్రి డాక్టర్‌ పక్కింటి వారికి కారును తీయమని చెప్పాడు. అదే అతడు చేసిన పాపమైంది. కారును తీయమంటావా అని డాక్టర్‌పై పక్కింటి వారు విచాక్షణరహితంగా దాడి చేశారు. దీంతో డాక్టర్‌కు తీవ్రగాయలయ్యాయి. చిన్న మొదలైన కారు పార్కింగ్‌ వివాదం.. చిలికి చిలికి పెద్దదిగా మారింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగింది. సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

హైదరాబాద్‌ నగరంలోని లాల్‌దార్వాజా ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వద్ద పక్కింటి వారు కారు పార్కింగ్‌ చేశారు. ఈ విషయంలో డాక్టర్‌ ప్రశాంత్‌కు ఆస్పత్రి పక్కింటి వారికి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే పక్కింటి వారు డాక్టర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. డాక్టర్‌ ప్రశాంత్‌ భార్య ఫిర్యాదు మేరకు షాలిబండ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం డాక్టర్ ప్రశాంత్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ప్రశాంత్‌ భార్య తెలిపారు.

పక్కింటి వారు గత కొన్ని రోజులగా తమ ఆస్పత్రి ముందే కారు పార్క్‌ చేస్తున్నారని డాక్టర్‌ ప్రశాంత్ భార్య తెలిపారు. పార్క్‌ చేసిన కారును తియ్యమని చెప్పినందుకు తమ ఆస్పత్రి లోపలికి వచ్చి దాడి చేశారన్నారు. కారు పార్కింగ్‌ వల్ల ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పినా వారు వినడం లేదన్నారు. ఈ సారి కారు తీయకుంటే పోలీసులకు పిర్యాదు చేస్తామంటే తమపై దాడి చేశారని డాక్టర్‌ భార్య తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


Next Story