కారు బీభ‌త్సం.. ఒక‌రి మృతి

Car accident Hasthinapuram traffic signal.వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధిలో శ‌నివారం తెల్ల‌వారు జామున ఓ కారు భీభ‌త్సం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2021 9:47 AM IST
కారు బీభ‌త్సం.. ఒక‌రి మృతి

వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధిలో శ‌నివారం తెల్ల‌వారు జామున ఓ కారు భీభ‌త్సం సృష్టించింది. మ‌ద్యం మ‌త్తులో కారు న‌డిపిన యువ‌కుడు ట్రాఫిక్ సిగ్న‌ల్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. వివరాల్లోకి వెళితే.. గౌతమ్‌ అనే యువకుడు తన స్నేహితులు ఇద్దరితో కలిసి సాగర్‌ రోడ్‌ నుంచి ఇబ్రహీం పట్నం వెళ్తున్నాడు. గౌత‌మ్ మ‌ద్యం సేవించి కారు న‌డుపుతు‌న్నాడు. ఈ క్ర‌మంలో కారు హస్తినాపురంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టాడు.

కారు డివైడర్ పై నుంచి మరో పక్కకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో కారు వెనుక సీటులో కూర్చొన్న సందీప్ అనే యువ‌కుడు అక్క‌డిక్క‌డే మృతి చెందాడు. మ‌రో యువ‌కుడు ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. యాక్సిడెంట్‌ చేసిన గౌతమ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.


Next Story