Hyderabad: ఇంటిని జాకీలు పెట్టి పైకిలేపే ప్రయత్నం.. బెడిసికొట్టిన ప్లాన్
రోడ్డు కిందకు ఉందని ఇంటిని జాకీలు పెట్టి లేపాలని ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. హైదరాబాద్ నగరంలోని చింతల్‌లో
By అంజి Published on 25 Jun 2023 12:51 PM ISTHyderabad: ఇంటిని జాకీలు పెట్టి పైకిలేపే ప్రయత్నం.. బెడిసికొట్టిన ప్లాన్
రోడ్డు కిందకు ఉందని ఇంటిని జాకీలు పెట్టి లేపాలని ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. హైదరాబాద్ నగరంలోని చింతల్‌లో ఇంటి యజమాని తన ఇల్లు రోడ్డు కంటే కిందకి ఉందని ఓ ఇంజనీర్ సహాయంతో హైడ్రాలిక్ జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేశాడు. ప్లాన్ బెడిసి కొట్టి భవనం పక్కింటిపై ఒరిగింది. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు భవనాన్ని కూల్చాలని నిర్ణయించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన నర్సింహారావు 25 ఏళ్ల కిందట జీ ప్లస్ 2 ఇంటిని నిర్మించాడు. ప్రస్తుతం ఆ ఇంటి ముందు ఉన్న రోడ్డు ఎత్తు పెరిగింది. వర్షం పడినా ప్రతీసారి వరద నీరు ఇంట్లోకి వస్తోంది. ఈ క్రమంలోనే తెలిసిన వారి సలహాలతో ఇంటిని పైకి లేపేందుకు ప్రయత్నించాడు. ఈ పనులను విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించాడు.
బిల్డింగ్‌లో యజమాని సహా ఆరు కుటుంబాలు ఉంటున్నాయి. అందులో రెండు కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లగా.. మరో రెండు కుటుంబాలు దగ్గర్లోని తెలిసిన వారి ఇళ్లకు మారారు. ఆ బిల్డిండ్‌లో యాజమాని కుటుంబంతో పాటు మరో కుటుంబం ఉంది. ఇంటిని ఎత్తు పెంచేందుకు వినియోగించిన హైడ్రాలిక్ జాకీలు శనివారం రాత్రి అదుపుతప్పాయి. దీంతో ఒక్కసారిగా ఆ భవనం పక్కనున్న మరో భవనంపైకి ఒరిగిపోయింది. విషయం తెలుసుకున్న జీడిమెట్ల సీఐ పవన్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అక్కడికి చేరుకుని వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. పర్మిషన్ లేకుండా మరమ్మతులు చేపట్టిన ఇంటి యజమానిపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం పక్కకు ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
రోడ్డు కిందకు ఉందని ఇంటిని జాకీలు పెట్టి లేపాలని చూస్తే ప్లాన్ బెడిసికొట్టిందిహైదరాబాద్ - చింతల్‌లో తన ఇల్లు రోడ్డు కంటే కిందకి ఉందని ఓ ఇంజనీర్ సహాయంతో హైడ్రాలిక్ జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేసిన ఇంటి యజమాని. 8 పోర్షన్లలో కిరాయికి ఉన్న వారు ఇంట్లో వుండగానే విచిత్ర… pic.twitter.com/mTlXHL1BgA
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2023