త్వ‌ర‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుంది : కేటీఆర్

మంగ‌ళ‌వారం శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు

By Medi Samrat  Published on  24 Sept 2024 2:15 PM IST
త్వ‌ర‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుంది : కేటీఆర్

మంగ‌ళ‌వారం శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పాతకాలంలో ఒక సామెత ఉండేది చెరువు నిండితే కప్పలన్ని వస్తాయి అని.. చాల తొందరలో తప్పకుండా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివితో మాట్లాడుతున్నార‌న్నారు. అతి తెలివితో మాట్లాడుతున్న శ్రీధర్ బాబు అంటున్నాడు.. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మీవోడే అంటున్నాడు. గాంధీకి కండవా కప్పిన సన్నాసి ఎవరు మరి శ్రీధర్ బాబు అంటూ ప్ర‌శ్నించారు.

మా ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న సన్నాసి ఎవరో చెప్పు శ్రీధర్ బాబు అని అడిగారు. అక్కలను నమ్ముకుంటే నా బ్రతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందని నిండు అసెంబ్లీలో అక్కలను అవమానించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. మా పార్టీ నుండీ గెలిచి కాంగ్రెస్ పార్టీలోకీ వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేల బతుకు ఇవ్వాల జూబ్లీ బస్టాండ్ అయిందన్నారు. అటెన్ష్ డైవర్షన్ తో ఎక్కువ కాలం రాజకీయాలు నడవవు రేవంత్ రెడ్డి అంటూ హిత‌వు ప‌లికారు.

Next Story