నిరూపిస్తే దేనికైనా సిద్ధం..దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు ఖండించిన ఎమ్మెల్యే

దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు.

By -  Knakam Karthik
Published on : 2 Jan 2026 12:53 PM IST

Hyderabad News, Durgam Cheruvu, Kotha Prabhakar Reddy, BRS MLA, Land Grabbing, Madhapur Police

నిరూపిస్తే దేనికైనా సిద్ధం..దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు ఖండించిన ఎమ్మెల్యే

హైదరాబాద్: దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం. నాపై కక్షతో పెట్టిన కేసు. హైకోర్టులో వేలం పెడితే రెండేకరాలు కొన్నాం. అయితే తర్వాత చెల్లదని TDR ఇచ్చారు. తరువాత దుర్గం చెరువు నిర్మాణం జరిగింది. బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయి. ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు నా పై కేసు పెట్టారు. దుర్గం చెరువులో నాకు భూమి లేదు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. రోడ్డు మీద, చెట్ల కింద వెహికిల్ పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారు.

అక్కడ ప్రభుత్వ భూమి కూడా లేదు. అక్కడ ప్రైవేట్ బస్సుల పార్కింగ్ చేస్తారు. అక్కడ ప్రభుత్వ భూమి గజం కూడా లేదు. అక్కడ నటుడు బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు ఉన్నాయి. ఎవ్వరూ పర్సనల్ ఫిర్యాదు చెయ్యలేదు... ఫిర్యాదులో hydra కనిపిస్తోంది. కేసు సమాచారం మా సిబ్బందికి పోలీసులు చెప్పారు. కేసు పై లీగల్ ఫైట్ చేస్తాం. పోలీస్ స్టేషన్ కు వెళ్తాను పోలీసులకు సహకరిస్తారు. అక్కడ వెహికిల్ పార్కింగ్ చేయడం సహజం. బేషరుతుగా కేసు విత్ డ్రా చేయకపోతే... FTL లో ఇండ్లు కట్టారు.. ఆ ఇండ్ల ముందు ధర్నా చేస్తా..అని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story