బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పెంపుడు కుక్క తప్పిపోయింది. దీపావళి పండగ రోజు సాయంత్రం బాణాసంచా, టపాకుల పేలుడు శబ్దాల కారణంగా బెదిరన కుక్క ఇల్లు దాటి బయటకు పారిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ దంపతులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో నివసిస్తున్నారు. వీరికి పెంపుడు కుక్క ఒకటి ఉంది. దానిని ఆండ్రూ ఫ్లెమింగ్ దంపతులు ముద్దుగా మున్ని అనే పేరుతో పిలుకుంటున్నారు. నవంబర్ 4వ తేదీన దీపావళి పండగ నేపథ్యంలో సాయంత్రం సమయంలో నగరంలోని ప్రజలు పెద్ద ఎత్తున టపాకులు కాల్చారు. భారీ శబ్దాల కారణంగా బెదిరిన మున్ని ఇంటి నుండి పారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆండ్రూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు. మా మున్నీ ఆచూకీ తెలిసిన వారు 87909 61118 ఫోన్ నంబర్‌కి కాల్ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.