సికింద్రాబాద్‌లో వీధి కుక్కల దాడి.. బాలుడు మృతి

సికింద్రాబాద్ పరిధిలో విషాద సంఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి బాలుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

By అంజి  Published on  17 July 2024 7:39 AM IST
Boy killed , attack, stray dogs, Secunderabad

సికింద్రాబాద్‌లో వీధి కుక్కల దాడి.. బాలుడు మృతి

హైదరాబాద్‌: సికింద్రాబాద్ పరిధిలో విషాద సంఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి బాలుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. నగరాల్లో పలుచోట్ల వీధి కుక్కలు.. ఒంటరిగా కనిపిస్తున్న చిన్నారులపై దాడి చేస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్న కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. ఇప్పుడు తాజాగా కుక్కల దాడిలో మరో బాలుడు బలి అయ్యాడు. జవహర్ నగర్ పరిధి లోని వికలాంగుల కాలనీలో వీధి కుక్కల వీరంగం సృష్టించాయి.

ఇంటి బయట ఆడుకుంటున్న ఒక చిన్నారి బాలుడిపై వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. బాలుడు గట్టి గట్టిగా అరుస్తున్నా కూడా ఆ చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో బాలుడి తల భాగాన్ని కుక్కలు సగం వరకు పీకి పడేశాయి. అంతలోనే స్థానికులు అటువైపు రాగా కుక్కల దాడిలో బాలుడు ఏడుస్తూ కనిపించాడు. వెంటనే స్థానికులు కుక్కలను తరిమి కొట్టారు. వీధి కుక్కల దాడిలో బాలుడి ఒంటిపై తీవ్ర గాయాలు అయ్యాయి.

దీంతో బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొడుకు మరణించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్వంతమయ్యారు. వీధి కుక్కల బెడద ఉందని పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోని వైనం... దీనికి ప్రతిఫలంగా ఓ బాలుడు మృతి చెందాడంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story