Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌: శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది.

By అంజి  Published on  29 Aug 2023 8:47 AM IST
Bomb threat, Shamshabad International Airport, Hyderabad

Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌: శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. దీంతో సిబ్బంది వెంటనే అలర్ట్‌ అయ్యి.. విమానాశ్రయంలో గాలింపు చేపట్టారు. చివరకు బాంబు లేదని నిర్ధారించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. సదరు ఆగంతకుడు మెయిల్‌ చేయగా.. అలర్ట్‌ అయిన విమానాశ్రయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని నిర్ధారించిన తర్వాత అది ఫేక్‌ కాల్‌గా గుర్తించారు. మరోవైపు బాంబు బెదిరింపునకు గురి చేసిన సదరు ఆగంతకుడిని కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారులు.

ఇదిలా ఉంటే.. నిన్న కొచ్చి నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో బాంబు ఉన్నట్లు మెసేజ్‌ అందడంతో.. విమానంలోని మొత్తం 139 మంది ప్రయాణికులను కొచ్చి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో దించేశారు. 6E6482 నంబ‌రు గ‌ల‌ విమాన స‌ర్వీసు ఉదయం 10.30 గంటలకు బెంగుళూరుకు వెళ్లాల్సి ఉండగా బెదిరింపు వచ్చింది. ఫ్లైట్ టేకాఫ్ అవ్వబోతుండగా విమానాశ్రయంలోని CISF కంట్రోల్ రూమ్‌కి బెంగళూరుకు విమానానికి సంబంధించి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న ప్రయాణీకులందరినీ డీబోర్డు చేశామని.. తదుపరి తనిఖీల కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించామని వారు తెలిపారు. నెడుంబస్సేరి పోలీసులు కూడా బాంబు బెదిరింపు కాల్‌ అందుకున్నామ‌ని ధృవీకరించారు. కేసు నమోదు చేసి కాల్ ఎక్క‌డినుంచి వ‌చ్చిందో తెలుసుకోవాడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story