గ్రేటర్‌ పోరు: రంగంలోకి అమిత్‌షా, యోగి, నడ్డా..

BJP Top leaders will campaign GHMC Elecitons.. గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. నువ్వా.. నే

By సుభాష్  Published on  24 Nov 2020 7:25 AM GMT
గ్రేటర్‌ పోరు: రంగంలోకి అమిత్‌షా, యోగి, నడ్డా..

గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. నువ్వా.. నేనా అన్నట్లు ఎవరికి వారు ప్రచారాన్ని హోత్తిస్తున్నారు. దీంతో గ్రేటర్‌లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటాపోటీ ప్రచారం కొనసాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి గ్రేటర్‌ పోరులో బీజేపీ రేసులో వచ్చింది.

గ్రేటర్‌లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌ తదితరు నేతలు హైదరాబాద్‌లో మకాం వేయగా, తాజాగా మరి కొంతమంది కమలం నేతలు రంగంలోకి దిగనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి కేటీఆర్‌ అన్ని తానై గ్రేటర్‌లో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక నిన్న ముఖ్యమంత్రి కేటీఆర్‌ సైతం గ్రేటర్‌ ప్రజలపై వరాల జల్లు కురిపించారు.

ఇక తామేమి తక్కువ కాదన్నట్లు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌, ఎమ్మెల్యే రఘనందన్‌రావు సహా రాష్ట్ర స్థాయి నేతలు సైతం నగరంలో తిష్ట వేశారు. గ్రేటర పీఠం కైవసం చేసుకుందుకు కాషాయదళం దానికి అనుగుణంగా ఓటర్లను ఆకర్షిస్తోంది. జాతీయ స్థాయిలోని నేతలను రంగంలోకి దింపుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌, జేపీ నడ్డాతో పాటు మరి కొంత మంది అగ్రనేతలు హైదరాబాద్‌కు రానున్నారు. వీరు గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు మంగళవారం ఈ అగ్రనేతల పర్యటనక సంబంధించి షెడ్యూల్‌ విడుదల కానుంది.

గ్రేటర్‌ ఎన్నికలపై కమలం ప్రత్యేక దృష్టి

కాగా, ఈ గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గ్రేటర్‌లో ప్రత్యేక దృష్టి సారించి విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని భావిస్తోంది. దీంతోనే అగ్రనేతలను సైతం రంగంలోకి దింపుతోంది. కాగా, 150 డివిజన్‌లు ఉన్న గ్రేటర్‌ జీహెచ్‌ఎంసీలో డిసెంబర్‌ 1న పోలింగ్ జరగనుంది. 4న ఫలితాలు వెలవడనున్నాయి.

Next Story
Share it