Hyderabad: శ్రీరామనవమి శోభా యాత్రకు రాజాసింగ్ నాయకత్వం

గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే టి రాజా సింగ్.. నగరంలో రామనవమి శోభా యాత్రకు నాయకత్వం వహించనున్నారు.

By అంజి  Published on  27 March 2024 10:41 AM IST
BJP MLA Raja Singh, Ram Navami Shobha Yatra, Hyderabad

Hyderabad: శ్రీరామనవమి శోభా యాత్రకు రాజాసింగ్ నాయకత్వం

హైదరాబాద్: గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే టి రాజా సింగ్.. నగరంలో రామనవమి శోభా యాత్రకు నాయకత్వం వహించనున్నారు. ఏప్రిల్ 17 బుధవారం ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందని తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ప్రకటించారు.

హైదరాబాద్‌లోని రామనవమి శోభాయాత్ర ధూల్‌పేట నుంచి ప్రారంభం కానుంది

హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌లోని ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

మార్చి 30, 2023న జరిగిన గత సంవత్సరం యాత్ర సందర్భంగా నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు విస్తృతమైన భద్రతా చర్యలు అమలు చేయబడ్డాయి. ఊరేగింపును పర్యవేక్షించడానికి సుమారు 1,500 మంది పోలీసులను మోహరించారు, సున్నిత ప్రదేశాలలో పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది కూడా హైదరాబాద్‌లో జరిగే రామనవమి శోభా యాత్రకు కూడా అదే తరహాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.

హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జిగా రాజా సింగ్ నియమితులయ్యారు

ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా రాజాసింగ్‌ను బీజేపీ నియమించింది. అయితే, హైదరాబాద్ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ మాధవి లతను అభ్యర్థిగా ప్రకటించింది.

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు బీజేపీ మరోసారి పట్టుదలతో కసరత్తు చేస్తోంది.

Next Story