హిందూ దేవతలను దూషించిన యూట్యూబర్ అన్వేష్‌ను భారత్‌కు రప్పించి కఠిన చర్యలు తీసుకొని, దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు అన్వేష్‌పై తెలంగాణలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్లు 352,79,299 BNS SEC 67IT ACT కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఖమ్మంలోనూ కేసు నమోదైంది. సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. అంతకుముందు వైజాగ్‌లోనూ అన్వేష్‌పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అటు ఆయన ద్రౌపదిని ఉద్దేశించి 'RAPE*' అంటూ పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
యూట్యూబర్ అన్వేషన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హిందూ దేవతలు, భారత మహిళల వస్త్రధారణపై అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని వీహెచ్‌పీ ప్రతినిధులు విశాఖ గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడిన అతడిని అరెస్ట్ చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలతో అన్వేష్ ఇన్‌స్టా, యూట్యూబ్‌లో లక్షలకుపైగా ఫాలోవర్లను కొల్పోయారు.