హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు Dk అరుణ, లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొననున్నారు. ర్యాలీగా వెళ్లి జూబ్లిహిల్స్ బీజేపీ ఉప ఎన్నిక అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. వెంకటగిరి విజయ దుర్గ పోచమ్మ టెంపుల్ నుంచి షేక్‌పేట్ MRO కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు.
మరో వైపు నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. కాగా నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.