హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫొటోల విషయంలో బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర బంద్‌కు మద్దతివ్వాలని కోరేందుకు ఆర్.కృష్ణయ్య సహా ఇతర బీసీ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును కలిసేందుకు వెళ్లారు. అయితే తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నేతల మధ్య ఫొటోల విషయంలో పరస్పర వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న కృష్ణయ్య, రాంచందర్ రావు వారించినా కూడా ఆ నేతలు వినకుండా దాడి చేసుకున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.