Hyderabad: కేబుల్ బ్రిడ్జి దగ్గర ఆగని బైక్ రేసింగ్‌లు

హైదరాబాద్ నగరంలో రోజురోజుకి బైక్ రైడర్స్ రోడ్లపై రెచ్చిపోతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు.

By అంజి  Published on  16 Jun 2024 8:15 AM GMT
Bike racing, cable bridge, Hyderabad

Hyderabad: కేబుల్ బ్రిడ్జి దగ్గర ఆగని బైక్ రేసింగ్‌లు

హైదరాబాద్ నగరంలో రోజురోజుకి బైక్ రైడర్స్ రోడ్లపై రెచ్చిపోతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు బైకులు తీసుకొని ఏకంగా రోడ్ల మీదకి వచ్చి తెల్లవారు జాము వరకు బైక్ రేసింగ్‌లు చేస్తున్నారు. ఈ విధంగా బైక్ పై వింత వింత విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గత వారం రోజుల క్రితం 100 మందికి పైగా బైక్ రేసింగ్ కి పాల్పడిన వ్యక్తులను పోలీసులు పట్టుకొని కటకటాల వెనక్కి పంపించారు. అయినా కూడా బైక్ రైడర్స్ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. యువకులు బైక్, కార్ రేసింగ్ కి పాల్పడుతూ రోడ్లపై నానా హంగామా సృష్టిస్తున్నారు. ప్రతిరోజు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఆకతాయిలు బైక్ పై చిత్ర విచిత్రమైన స్టంట్ లు వేస్తూ రోడ్డు మీద హంగామా రేపుతున్నారు. ముఖ్యంగా ఈ ఆకతాయి యువకులు టీ హబ్ సమీపంలోని రోడ్లపై బైక్, కార్లతో రేసింగ్ లు చేస్తున్నారు.

అంతటితో ఊరు కోకుండా కారు రేసర్లు, బైక్ పై స్టాంట్లు వేసి కుర్రాళ్లంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. come to t-hub పేరుతో Instagram, Facebook లో అకౌంట్ క్రియేట్ చేశారు. వేలకు వేలు పందెం వేసుకుని బైక్ లపై స్టంట్ లు వేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నగరం నలుమూలల నుండి యువకులు టి- హబ్ వద్దకు చేరుకొని పందెం కోసం కొంతమంది కుర్రాళ్ళు బైక్ పై చిత్రవిచిత్రమైన స్టంట్లు వేస్తుంటే... మరి కొంతమంది యువకులు కారు రేసింగ్‌లు చేస్తున్నారు. వీరు బైక్ మీద చేసే వింత వింత విన్యాసాల వల్ల వాహనదారులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాహనాలను నడుపుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు బైక్ రేసింగ్ నిర్వహిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు.

Next Story