హైదరాబాద్‌కు బీహార్ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే
Bihar MIM MLAs who came to hyderabad .. హైదరాబాద్‌కు బీహార్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో
By సుభాష్ Published on 12 Nov 2020 12:51 PM GMT
హైదరాబాద్‌కు బీహార్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఐదుగురు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు హైదరాబాద్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. బుధవారం సాయంత్రం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద బీహార్ ఎమ్మెల్యేలు అక్తరుల్ ఇమాన్, మహ్మద్ ఇజాహర్ ఆసీఫ్,షాహనవాజ్ ఆలం, సయ్యద్ రుకునుద్దీన్, అజహర్ నయీమ్‌లకు హైదరాబాద్‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా దారుస్సలాం చేరుకుని పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని కలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని, దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము పర్యవేక్షిస్తామని కొత్త ఎమ్మెల్యేలకు అసదుద్దీన్ ఒవైసీ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ బలాన్ని అంచనా వేయడానికి వీలు కలుగుతుందని, దీని ద్వారా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవచ్చని కొత్త ఎమ్మెల్యేలు అభిప్రాయపడగా, వారితో ఒవైసీ ఏకీభవించారని నేతలు చెబుతున్నారు.