బాటిక్, కలంకారి ఆర్ట్ లో రాణిస్తున్న మరియా క్లారా

Batik artist Maria Clara talks about art, life, and her passions.మరియా క్లారా తన కళ ద్వారా ఎంతో పేరు తెచ్చుకుంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Feb 2023 7:16 AM GMT
బాటిక్, కలంకారి ఆర్ట్ లో రాణిస్తున్న మరియా క్లారా

హైదరాబాద్: మరియా క్లారా తన కళ ద్వారా ఎంతో పేరు తెచ్చుకుంది. బాటిక్, కలంకారి కళాకారిణి అయిన ఆమె సోలో బాటిక్ ఎగ్జిబిషన్ "ది విజిల్" కు మంచి స్పందన వచ్చింది. పలువురు ప్రముఖులు, కళ మీద ఇష్టం ఉన్న చాలా మంది ఆమె సృష్టించిన కళాకండాలను చూసి మెచ్చుకున్నారు. మరియా తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఒక కళాకారిణిగా పూర్తి సమయం కేటాయిస్తోంది.

ఆమె బాటిక్ వర్ణనలో 'కింగ్-డేవిడ్' కూడా ఉన్నారు. ఇందులో ఒక రాజు ఆనందంగా వీణ వాయిస్తూ.. పాడుతూ కనిపించాడు. ఆమె తన విద్యను చూపించడానికి మైనం, అనేక రకాల రంగులను ఉపయోగించింది. ఇది పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది. ఆమె పాఠశాల పిల్లల కోసం వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తుంది. అనాథాశ్రమాలు, మహిళా సంస్థలను కూడా సందర్శిస్తుంది.

న్యూస్‌మీటర్‌తో జరిగిన సంభాషణలో ఆమె కళ, జీవితం, తన అభిరుచుల గురించి చెప్పుకొచ్చింది

న్యూస్ మీటర్: బాటిక్ కళ అంటే ఏమిటి?

మరియా క్లారా: బాటిక్ అనేది ఫాబ్రిక్‌పై చేసిన కళకు ఒక రూపం. ఇందులో రూపురేఖలను గీయడానికి మైనంను ఉపయోగిస్తాం. మొదట్లో గీతలు గీయడానికి ట్జాంటింగ్ పెన్ను, మైనపుతో మందమైన గీతల కోసం బ్రష్‌ని ఉపయోగిస్తాను. ఫాబ్రిక్‌ను రంగులో ముంచినప్పుడు, మైనపు పగిలిపోతుంది. రంగు లోపలికి వస్తుంది, ఇది ఫాబ్రిక్ కు క్రాక్ ఎఫెక్ట్ ను ఇస్తుంది.

న్యూస్ మీటర్: కలంకారి కళ అంటే ఏమిటి?

మరియా క్లారా: పెన్ కలంకారి అనేది మైరోబాలన్ పౌడర్, పాలలో నానబెట్టి బట్టను తయారు చేసే ఒక కళ. అప్పుడు రూపురేఖలు, వివరాలు కాసిమ్‌తో తయారు చేయబడతాయి (నల్ల బెల్లం మరియు ఇనుప తుప్పును 21 రోజుల పాటు ఒక కుండలో పులియబెట్టడం ద్వారా పొందిన నలుపు రంగు) ఆపై ఎండలో ఎండబెట్టి, మంచి నీటిలో కడుగుతారు. రంగులు మొత్తం సహజమైన ఆకులు, పువ్వులు, మూలాల నుండి సేకరిస్తారు.

NM: మిమ్మల్ని ప్రేరేపించేది ఏమిటి?

మరియా క్లారా: దేవుని గొప్పతనం గురించి నా అనుభవాలను చెప్పడం నాకు చాలా ఇష్టం. కళ అనేది దానిని వ్యక్తీకరించడానికి, మిమ్మల్ని మీరు వ్యక్తీకరించడానికోసమని నేను భావిస్తాను. మీరు ధరించే బట్టలు, పెయింటింగ్‌ల ద్వారా ఇతరులను ప్రేరేపించవచ్చు.. దీన్ని చాలా గొప్ప మార్గంగా నేను భావిస్తున్నాను. 'కలాంబాటిక్ బై మరియా క్లారా' ఈ రెండు కళారూపాలతో ఫాబ్రిక్‌పై అనుకూల డిజైన్‌లను చేసి చూపిస్తూ ఉంటాం.

NM: మీరు ఈ కళారూపాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

మరియా క్లారా: నేను ఆయిల్, కాన్వాస్‌పై యాక్రిలిక్, వుడ్‌కట్‌లపై కూడా ఆర్ట్ ను వేశాను. నా జీవితానికి సంబంధించి బాటిక్ నాకు చాలా ఇష్టమైనది. జీతంలో మనకు ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. మనసు విరిగిపోయి ఉంటుంది.. ఎన్నో విషయాల్లో గాయపడి ఉంటాం. పగుళ్లు బాటిక్‌ను మరింత అందంగా మార్చే విధంగా ఉంటాయి.



NM: 'ది విజిల్' వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి?

మరియా క్లారా: కోవిడ్ నాకు స్ఫూర్తి. దేవుడు సృష్టించిన చాలా వస్తువులను నేను తక్కువగా భావించాను-నేను పీల్చే గాలి, సూర్యుడి నుండి వచ్చే వెచ్చదనం, పువ్వుల సువాసన.. ఇలా చాలానే ఆ దేవుడు మనకు ఇచ్చాడు. ఆ దేవుడు మన ఉనికిని సృష్టించినప్పటి నుండి.. అతని సృష్టి అంతా 24x7, 365 రోజులు మనకు కనిపిస్తుంది. ది విజిల్ వెనుక ఉన్న ప్రేరణ అదే..!

NM: మీరు కార్పొరేట్ జీవితాన్ని విడిచిపెట్టి పూర్తి సమయం కళపై దృష్టి పెట్టాడానికి కారణమేమిటి?

మరియా క్లారా: అందుకు కారణం కూడా కోవిడ్. నా జీవితం నా నియంత్రణలో లేదని నేను గ్రహించాను. నేను నా లైఫ్ లో అనుకున్నది సాధించాలి.. నేను నా జీవితానికి తిరిగి ఇవ్వాల్సింది చాలా ఉంది. పని చేయడం కష్టమే.. అంతేకాకుండా నేను నాలో ఉన్న కళాకారిణిని సజీవంగా ఉంచాలని ఎంచుకున్నాను.

Next Story