హైదరాబాద్‌ నగరాన్ని ప్లాస్టిక్ కాలుష్యం నుండి విముక్తి చేసే మిషన్‌కు శ్రీకారం చుట్టిన బన్యన్ నేషన్

Banyan Nation Meet Hyderabadi anti-plastic warriors who bagged World Economic Forum award.హైదరాబాద్‌కు చెందిన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 May 2022 6:50 AM
హైదరాబాద్‌ నగరాన్ని ప్లాస్టిక్ కాలుష్యం నుండి విముక్తి చేసే మిషన్‌కు శ్రీకారం చుట్టిన బన్యన్ నేషన్

హైదరాబాద్‌కు చెందిన `బన్యన్ నేషన్' సంస్థ నగరాన్ని ప్లాస్టిక్ కాలుష్యం నుండి విముక్తి చేసే మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ 500-600 టన్నుల షాంపూ సీసాలు, నూనె సీసాలు, డిటర్జెంట్ కంటైనర్లు మరిన్నింటిని రీసైకిల్ చేస్తుంది. ఇవన్నీ పాలిథిలిన్ లేదా పాలీప్రొఫైలిన్ వంటి అధిక సాంద్రత కలిగిన ప్లాస్టిక్‌ల వర్గంలోకి వస్తాయి. వీటిని రీసైకిల్ చేసి మళ్లీ చాలాసార్లు ఉపయోగించవచ్చు.

"రీసైకిల్ చేయగల ప్లాస్టిక్‌లను రీసైక్లింగ్ చేయకపోవడం వల్ల భారతదేశానికి పర్యావరణ సంక్షోభం తలెత్తుతుంది. దీనిపై బన్యన్ నేషన్ ముందుకు వెళుతోంది. మేము వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను ఎదుర్కోవాలనుకున్నాము. రీసైకిల్ చేయగలిగే వాటిని రీసైక్లింగ్ చేయడం ప్రారంభించాము," అని బన్యన్ డైరెక్టర్ రాశి అగర్వాల్ చెప్పారు. అన్ని ప్లాస్టిక్‌లను రీసైకిల్ చేయడానికి బదులుగా డౌన్‌సైకిల్ చేస్తున్నామని ఆమె వివరించారు. డౌన్ సైకిల్ చేయడం వలన ఇవి కాస్తా ముడి పదార్థాలుగా మారతాయి. రీసైకిల్ చేయబడతాయి.. తయారీ ప్రక్రియలో తిరిగి ఉపయోగించబడతాయి," అని రాశి వివరించారు.


బన్యన్ నేషన్ ప్రతి నెలా టన్నుల కొద్దీ వ్యర్థాలను సేకరిస్తుంది. ముందుగా దానిని ప్రాసెస్ చేస్తుంది, అలా అన్ని కాలుష్యాలు తొలగించబడతాయి. హైదరాబాద్‌లోని వారి ఫ్యాక్టరీలో.. ప్లాస్టిక్ క్లీనింగ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా, మొత్తం ప్లాస్టిక్ ను చిన్న ప్లాస్టిక్ గుళికల లాగా తయారు చేస్తారు. "మా క్లయింట్లు తమ తయారీ యూనిట్లలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ గుళికలలో ఎంత శాతాన్ని అయినా మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఈరోజు మీరు సర్ఫెక్సెల్ బాటిల్‌ని చూస్తే, కంటైనర్ కేవలం 50% వర్జిన్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. మిగిలిన 50% రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. రెండు వర్జిన్ ప్లాస్టిక్, రీసైకిల్ ప్లాస్టిక్‌లను కలపడం ద్వారా, కంటైనర్‌లను చాలా సార్లు రీసైకిల్ చేయవచ్చు" అని రాశి చెప్పారు.


ప్లాస్టిక్ క్లీనింగ్ టెక్నాలజీ.. సేకరించిన పోస్ట్-కన్స్యూమర్, పోస్ట్-ఇండస్ట్రియల్ ప్లాస్టిక్ వ్యర్థాలను అధిక-నాణ్యత ఉన్న రీసైకిల్ గ్రాన్యూల్స్‌గా మారుస్తుంది. దీన్ని నాణ్యత, పనితీరులో వర్జిన్ ప్లాస్టిక్‌తో పోల్చవచ్చు. వీరు చేస్తున్న ప్రయత్నాల కారణంగా నగరాలు తమ వ్యర్థాలను మరింత సమర్థవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. బన్యన్ నేషన్ రీసైక్లింగ్ పద్ధతి ముడి పదార్థాల నుండి వీలైనంత వరకూ ప్లాస్టిక్ ను తీసుకుని రావడానికి పనికి వస్తుంది.


ఈ పద్ధతి కారణంగా బిలియన్ల డాలర్ల ఖర్చులు ఆదా అవుతాయి. పర్యావరణ ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయి. 2013లో బన్యన్ నేషన్ స్థాపించినప్పటి నుండి 300 మిలియన్ బాటిళ్ల (షాంపూలు, నూనెలు, కండిషనర్లు మరియు మరిన్ని) ను వీరు రీసైకిల్ గ్రాన్యూల్స్‌గా మార్చడం జరిగింది. 2018లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సర్క్యులర్ ఎకానమీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ కంపెనీ కూడా బన్యన్ నేషన్ నిలిచింది.


INK@WASH 3.0 (Innovations & New Knowledge in Water, Sanitation and Hygiene) లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీలలో "బన్యన్ నేషన్" కూడా ఒకటి. INK@WASH 3.0 హైదరాబాద్ లో మే 2022లో నిర్వహించనున్నారు. INK@WASH తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD), డిపార్ట్‌మెంట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. స్టార్టప్‌లు/ఆవిష్కర్తలు, సలహాదారులు, విద్యాసంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Next Story