జానపద గాయకుడు ఆత్మహత్య

Banjara Singer Jatavat Mohan commits suicide.తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్ర‌ముఖ జాన‌ప‌ద గాయ‌కుడు హైద‌రాబాద్‌లోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2022 9:48 AM GMT
జానపద గాయకుడు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్ర‌ముఖ జాన‌ప‌ద గాయ‌కుడు హైద‌రాబాద్‌లోని చంపాపేట‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న తీవ్ర‌క‌ల‌క‌లం రేపింది. న‌ల్ల‌గొండ జిల్లా తిరుమ‌ల‌గిరి మండ‌లం పిల్లిగుండ్ల తండాకు చెందిన జ‌టావ‌త్ మోహ‌న్ బంజారా పాటలు పాడేవాడు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా హైద‌రాబాద్‌లోని చంపాపేట‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రాత్రి తాను అద్దెకు ఉండే గ‌దిలోనే ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని బుధ‌వారం ఉద‌యం గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. మోహ‌న్ ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి ఉంటార‌ని స్థానికులు చెబుతున్నారు.

Next Story
Share it