హైదరాబాద్‌లో లవర్స్‌ కనిపిస్తే పెళ్లి చేస్తాం: బజరంగ్‌ సేన

వాలంటైన్స్‌ డే సందర్భంగా పార్కులు, హోటళ్లలో జంటలు కనబడితే తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లిళ్లు చేస్తామని బజరంగ్‌ సేన హెచ్చరించింది.

By అంజి  Published on  14 Feb 2025 7:26 AM IST
Bajrang Sena, lovers, married, Hyderabad

హైదరాబాద్‌లో లవర్స్‌ కనిపిస్తే పెళ్లి చేస్తాం: బజరంగ్‌ సేన

వాలంటైన్స్‌ డే సందర్భంగా పార్కులు, హోటళ్లలో జంటలు కనబడితే తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లిళ్లు చేస్తామని బజరంగ్‌ సేన హెచ్చరించింది. కాచిగూడలో గురువారం నాడు జరిగిన సమావేశంలో బజరంగ్‌ సేన సభ్యులు మాట్లాడారు. వాలంటైన్స్‌ డే మన సంస్కృతి కాదని, పాశ్చాత్య సంస్కృతి అని నాయకులు గుర్తు చస్త్రశారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. హద్దులు మీరి పార్కులు, హోటళ్లలో వికృత చేష్టలు చేస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు.

ప్రేమ ముసుగులో వాలంటైన్‌ డే నిర్వహించడం సరికాదని వీహెచ్‌పీ తెలిపింది. ''ప్రేమకు మేం వ్యతిరేకం కాదు. కానీ, ప్రేమ ముసుగులో కార్పొరేట్‌ సంస్థలు యువతను ప్రోత్సహిస్తున్నారు. ఇది లెటెస్ట్‌ ట్రెండ్‌ అంటూ చిత్రీకరిస్తున్నారు. వాస్తవానికి ఇది ఒక ద్రోహం. ప్రేమికుల రోజు ఈవెంట్ల పేరిట డ్రగ్స్‌ ఆశ చూపి సొమ్ము చేసుకుంటున్నారు. విచ్చలవిడితనం భారతీయ ధర్మం కాదు'' అని వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ బాలాస్వామి తెలిపారు.

Next Story