జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల సందర్భంగా ప్రజా శాంతి, భద్రత దృష్ట్యా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతీ, ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968 లోని సెక్షన్ 20 ప్రకారం ఆయన జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతాల్లో ఉన్న అన్ని వైన్ షాపులు, టాడీ దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, స్టార్ హోటల్స్ మరియు రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లు మూసివేయాలని ఆదేశించారు.
ఈ ఆదేశాలు 2025 నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుండి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి . అలాగే ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు నవంబర్ 14న ఉదయం 6 గంటల నుండి లెక్కింపు పూర్తయ్యే వరకు, అలాగే అవసరమైతే రిపోల్ రోజు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ ఆదేశాలు ప్రజాప్రతినిధుల చట్టం, 1951 లోని సెక్షన్ 135-C ప్రకారం జారీ చేయబడ్డాయని కమిషనర్ అవినాష్ మోహంతీ తెలిపారు.