ఫుడ్ ఆర్డర్ లేటు అయ్యిందని.. డెలివరీ బాయ్‌పై దాడి
Attack on Food Delivery boy in Humayunnagar.ఓ కస్టమర్ ఫుడ్ డెలివరీ లేట్ అయిందని ఫుడ్ డెలివరీ బాయ్‌పై
By తోట వంశీ కుమార్ Published on 3 Jan 2023 8:19 AM ISTసాధారణంగా ఫుడ్‌ను ఆర్డర్ పెట్టినప్పుడు దాదాపుగా నిర్ధేశించిన సమయంలోనే పార్శిల్ అందుతుంది. ఫుడ్ డెలివరీ బాయ్ కూడా నిర్ధేశించిన సమయానికి ఫుడ్ అందించేందుకు కష్టపడుతుంటారు. అయితే.. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ కారణంగా కావొచ్చు, మరేదైనా కారణం చేత ఆర్డర్ లేట్ అవుతుంటుంది. అలాంటి సందర్భాల్లో కొందరు కస్టమర్లు లైట్ తీసుకుంటారు గానీ మరికొందరు మాత్రం ఎందుకు లేట్ అయ్యిందని ఫుడ్ డెలివరీ బాయ్‌తో గొడవలకు దిగుతుంటారు.
ఇలాగే ఓ కస్టమర్.. ఫుడ్ డెలివరీ లేట్ అయిందని తన స్నేహితులతో కలిసి ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని హుమాయున్‌నగర్ చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. అతడు పెట్టిన ఆర్డర్ లేట్ అయింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతను ఫుడ్ డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. 15 మంది తన అనుచరులతో కలిసి హోటల్‌కు వెళ్లి అక్కడ వీరంగం ఆడాడు. వీరి నుంచి తప్పించుకునే క్రమంలో ఫుడ్ డెలివరి బాయ్ హోటల్‌లోకి పరుగులు తీశాడు. అయినప్పటికీ వారు శాంతించకుండా హోటల్‌లోకి వెళ్లి మరీ దాడి చేశారు. ఈ క్రమంలో కిచెన్‌లో స్టౌపై ఉన్న వేడి నూనె డెలివరీ బాయ్‌తో పాటు నలుగురిపై పడింది.
వీరికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.