హైదరాబాద్‌లో దారుణం.. యజమాని ప్రాణం తీసిన పెంపుడు కుక్క
హైదరాబాద్: పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
By అంజి
హైదరాబాద్‌లో దారుణం.. యజమాని ప్రాణం తీసిన పెంపుడు కుక్క
హైదరాబాద్: పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందిన డి.పవన్ కుమార్ (37) తన స్నేహితుడు సందీప్ తో కలిసి గత ఐదేళ్ళుగా మధురానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పవన్ కుమార్ ప్రైవేటు సంస్థలో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా ఆఫీసుకు వెళ్ళడం లేదు. ప్రతిరోజు ఆసుపత్రికి స్నేహితునితో కలిసి వెళ్ళి వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా ఆసుపత్రికి వెళ్ళి రాత్రి దాదాపు 11 గంటల సమయంలో తన గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు.
పక్కనే అతని పెంపుడు కుక్క కూడా పడుకుంది. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. దాంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిపించి తలుపు పగలకొట్టి లోనికి వెళ్ళగా పవన్ చనిపోయి ఉన్నాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటినిండా రక్తం ఉంది. దాంతో కుక్క అతని మర్మాంగాలు తినడం వల్లనే మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. పవన్ కుమార్‌కు గతంలో వివాహం జరిగింది. భార్య విడాకులు ఇవ్వడంతో నగరంలో ఉంటున్నాడు. స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.