హైదరాబాద్‌లో దారుణం.. కూతురిని మూడో అంతస్తు నుంచి తోసేసి చంపిన తల్లి.. 'దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడని'..

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన జరిగింది. పిల్లలకు ఏ చిన్న దెబ్బ తాకినా కూడా తల్లిదండ్రులు విలవిలలాడిపోతూ ఉంటారు.

By -  అంజి
Published on : 16 Dec 2025 1:40 PM IST

Atrocities in Hyderabad, Woman throws daughter from third floor, Malkajgiri, Crime

హైదరాబాద్‌లో దారుణం.. కూతురిని మూడో అంతస్తు నుంచి తోసేసి చంపిన తల్లి.. 'దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడని'..

హైదరాబాద్‌: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన జరిగింది. పిల్లలకు ఏ చిన్న దెబ్బ తాకినా కూడా తల్లిదండ్రులు విలవిలలాడిపోతూ ఉంటారు.. కానీ ఓ తల్లి మాత్రం తన కూతుర్ని అతి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో నివాసముంటున్న మోనాలిసా అనే మహిళ ఆమె కూతురు షారోని మేరిని బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి ఒక్కసారిగా మూడో అంతస్తు పై నుండి కిందకు తోసేసింది. మూడో అంతస్తు పై నుండి కింద పడిపోవడంతో ఆ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

అది గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారి తల్లిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో.. దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడు అన్న నమ్మకంతో కింద పడేసానని తల్లి చెప్పిన మాటలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.. పాపను మేడ పైనుండి కిందికి తోసేయడానికి ఏవైనా కారణాలు ఉన్నాయా లేక తల్లి మానసిక స్థితి బాగోలేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story