Hyderabad: హిజ్రాల ఆగడాలు.. పెళ్లి ఇంటికి వచ్చి..

తెలుగు రాష్ట్రాల్లో హిజ్రాలు ఆగడాలు ఎక్కువయ్యాయని ప్రజలు వాపోతున్నారు. తాజాగా హైదారాబాద్‌ నగరంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటికి వచ్చి హంగామా చేశారు.

By అంజి  Published on  25 April 2024 10:14 AM IST
wedding ceremony, Hyderabad, Hijras

Hyderabad: హిజ్రాల ఆగడాలు.. పెళ్లి ఇంటికి వచ్చి..

తెలుగు రాష్ట్రాల్లో హిజ్రాలు ఆగడాలు ఎక్కువయ్యాయని ప్రజలు వాపోతున్నారు. తాజాగా హైదారాబాద్‌ నగరంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటికి వచ్చి హంగామా చేశారు. ఎంగేజ్‌మెంట్‌ నాడు డబ్బులు ఇచ్చామని ఫ్యామిలీ చెప్పగా.. ఎంగేజ్మెంట్‌ వేరు, పెళ్లి వేరు అని హిజ్రాలు డబ్బులు డిమాండ్ చేశారు. ముగ్గురు వచ్చి రూ.25 వేలు అడిగారని ఓ నెటిజన్‌ వీడియోను షేర్‌ చేశాడు.

''హైదరాబాద్ లో ఈ హిజ్రా మాఫియా దారుణం. నా ఫ్యామిలీ ఫంక్షన్‌లో సీన్ క్రియేట్ చేశారు. వారు ముఠాగా వచ్చి మేం వారికి రుణపడి ఉన్నట్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అది సరిపోక.. వారిలో ముగ్గురికి 25వేలు కావాలన్నారు'' అంటూ నెటిజన్‌ పేర్కొన్నాడు. వీడియోను హైదరాబాద్‌ పోలీసులకు ట్యాగ్‌ చేస్తూ షేర్‌ చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు.. ఈ ఘటనను పరిశీలిస్తున్నామని తెలిపారు.

హిజ్రాలు ఇలా చేస్తే డయల్‌ 100కు కాల్‌ చేయాలని పోలీసులు సూచించారు. ఇదే వీడియోపై స్పందించిన మరో నెటిజన్‌.. హిజ్రాల కఠిన చర్యలు తీసుకోవాలాని కోరారు. ఇది దోపిడీ అని, కుటుంబాలు వేలకు వేలు కారణం లేకుండా సమర్పించుకోవాల్సి వస్తోందని, లేకపోతే ఇబ్బందిగా మిగిలిపోతోందని అన్నారు. పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నామని.. ఇప్పటికైనా పోలీసులు సరైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story