బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం.. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరు
AP Minister Botsa Son marriage at Hyderabad.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు
By తోట వంశీ కుమార్ Published on
11 Feb 2022 8:34 AM GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహవేడుకకు ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, సినీ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. నూతన వధువరులు లక్ష్మీనారాయణ్ సందీప్, పూజితను ఆశీర్వదించారు.
బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేటీఆర్, శ్రీధర్ బాబు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చొన్నారు. ఇక మంత్రి కేటీఆర్‌తో ఫోటోలు దిగేందుకు వైసీపీ నేతలు, పెళ్లికి హాజరైన కార్యకర్తలు పోటీ పడ్డారు.
Next Story